Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ నిబంధన ప్రకారం
- ఖర్చు 15-20 శాతం...
- జనం జేబులపై 58.7 శాతం వరకు భారం
- కరోనా మహమ్మారిని భారత్ ఎదుర్కోలేదు : నిపుణులు
న్యూఢిల్లీ : భారత్‌లో గత రెండు నెలలుగా తీవ్రమైన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సెకండ్‌వేవ్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా అయిపోతున్నప్పుడు కరోనా రోగులను, వారి బంధువులను ఉక్కిరిబిక్కిరి చేసే దృశ్యాలు ప్రజలకు తమ జీవితాంతమూ గుర్తు చేస్తాయి. సరైన సంఖ్యలో బెడ్లు లేకపోవడం, మందులు, వ్యాక్సిన్ల కొరత ఇలా ప్రతి ఒక్కటి రోగులు పట్టి పీడించింది. అయితే ఇవన్నీ భారత్‌లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్నదనడానికి నిదర్శనమని వైద్య నిపుణులు ఆరోపించారు. దేశంలో సంభవిం చిన కరోనా మరణాలన్నిటికీ మహమ్మారి ఒక్కటి మాత్రమే కారణం కాదనీ, ఇందులో పేలవమైన దేశ ఆరోగ్య వ్యవస్థ హస్తం కూడా ఉన్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అలసత్వం కారణంగానే దేశంలో ఆరోగ్యవ్యవస్థ బలహీనంగా ఉన్నదని ఆరోపించారు.
దేశంలో మహమ్మారిని నిరోధించడంలో భాగం గా ఏడాది క్రితమే మోడీ సర్కారు వైఫల్యాలు బయట కు వచ్చాయి. ఆరోగ్యనిపుణులు, ప్రతిపక్ష పార్టీలు చేసిన ముందస్తు హెచ్చరికలను కేంద్రం పెడచెవిన పెట్టడం కారణంగానే కరోనా విజృంభించడానికి కారణమైందని గుర్తు చేశారు. కేంద్రం చురుకుగా స్పందించి ఉంటే మొదటి దశలో మాస్కులు, శానిటైజర్లు వంటి ఇతర విషయాల్లో ఆలస్యం జరిగేది కాదని చెప్పారు. అయితే, సెకండ్‌వేవ్ సమయంలో నూ కేంద్రం తీరు మారలేదని నిపుణులు అసంతృప్తి ని వ్యక్తం చేశారు.
సెకండ్‌వేవ్ సవాళ్లను ఎదుర్కోవ డానికి కేంద్రం ముందుకు రాకపోవడంతో ప్రజల ప్రాణాలను రక్షించే అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రి కొరత ఏర్పడిందనీ, ఇందులో కేంద్రం విఫలమైందని వివరించారు. అయితే, వాస్తవానికి సమస్య కేవలం మహమ్మారి మాత్రమే కాదని ఆరోగ్య వ్యవస్థను ప్రభావితంచేసే మూడు అంశాలు ఇందు లో భాగమని చెప్పారు. అందరికీ కనీస సంతృప్తికర మైన ఆరోగ్య సంరక్షణను తీర్చడానికి తగిన వనరుల ను కేటాయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. రెండోది, ఆరోగ్య సం రక్షణ వ్యవస్థలో అధిక, పెరుగుతున్న అసమానతలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైవ్‌స్టార్ లాంటి సౌకర్యా లు ఉన్నప్పటికీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు, ప్రాథ మిక పరికరాలు, వైద్యులు లేకపోవడం గమనించా ల్సిన అంశమని వైద్య నిపుణులు తెలిపారు. మూ డోది, సాధారణ ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగు ణంగా నిధుల కేటాయింపులు లేవని వారు వివరిం చారు. ప్రజల ప్రాణాలను పక్కనబెట్టి, కార్పొరేటు, ఇతర ప్రయివేటు ఆస్పత్రులకు లబ్ది చేకూరేలా, వారి ప్రయోజనాల కోసమే పని చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉన్నదని ఆరోపించారు. ఈ ఆస్పత్రులకు లాభాలను తెచ్చే కర్యాక్రమాలకు వనరులను మళ్లించడానికి ఒత్తిడి పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయులు ముఖ్యంగా తమ ఆరోగ్యం విషయంలో తమ సొంత జేబుల నుంచి 58.7 శాతం వరకు ఖర్చు చేస్తున్నారనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధన ప్రకారం ఇది 15-20 శాతంగా ఉన్నది. అంటే భారతీయులు ఆరోగ్యం విషయంలో అధికంగా ఖర్చు చేస్తున్నారనీ, ప్రభుత్వాలు మాత్రం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉండకపోవడం తోనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు ఆరోపించారు.