Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ప్రతీ నగరానికి చరిత్రక, భౌగోళిక నిర్మాణంతో పాటు వైరస్, బ్యాక్టిరియాలకు సంబంధించి ప్రత్యేకమైన మైక్రోబయోమ్‌ను కలిగి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడిం చింది. ప్రపంచంలోని వివిధ నగరాల్లో శాంపిళ్లను సేకరించి ఈ మెటాజె నోమిక్ అధ్యయనం నిర్వహించారు. ప్రతీ నగరమూ బ్యాక్టిరియా, వైరస్ లకు సంబంధించి ప్రత్యేకమైన మైక్రోబయోమ్, ఫింగర్‌ప్రింట్‌ను కలిగి ఉంటుంది. ప్రపంచంలోని 60 నగరాల్లో సబ్‌వేలు, బస్సులు, రైళ్లు, ట్రామ్ లు, ఆస్పత్రులు సహా ప్రజా రవాణా వ్యవస్థల నుంచి సేకరించిన నము నాల జన్యు క్రమాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్టు పరిశోధ కులు తెలిపారు. ఈ అధ్యయన పరిశోధకులలో ఒకరైన క్రిస్టోఫర్ మాసన్ మాట్లాడుతూ.. ఈ అంశంపై ఇదివరకే పరిశోధన సాగించినప్పటికీ అది న్యూయార్క్ నగరానికే పరిమితం చేయబడింది. కానీ ప్రస్తుతం అధ్య యనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు. అయితే, ఇదివరకు గుర్తించిన వాటితో పోలిస్తే 40 శాతం వాటి డీఎన్ఏతో సరిపోలలేదని అన్నారు. దాదాపు 11 వేల వైరస్, 1300 బ్యాక్టిరియాలు కొత్తవేననీ, ఇది నిజంగా ఆసక్తిని కలిగించే అంశమని పేర్కొన్నారు.ప్రపంచంలోని వివిధ నగరాల నుంచి సేకరించిన 97 శాతం నమూనాల్లో 31 జాతుల సూక్ష్మజీవుల సమితి ఉందని అధ్యయనం పేర్కొంది.మానవ చర్మ, కిటికి వంటి వంటి ఉపరితలాలపై తీసుకున్న 70 శాతం కంటే ఎక్కువ నమూనాల్లో 1145 జాతులు ఉన్నాయని పేర్కొంది.