Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాంటి ప్రకటనా చేయని ట్విట్టర్
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలపై మోడీ సర్కార్ రూపొందించిన నూతన ఐటీ నిబంధనావళి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనావళి ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చిందని, వీటిని వెం టనే అమలుజేయాలని సోషల్ మీడియా కంపెనీలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోంది.ముగ్గురు ముఖ్యమైన అధికారులను నియమించారా? నియమిస్తే వారి పేర్లను వెంటనే అందజేయాలని కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో అధికారుల నియామకం, వారి పేర్లను గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ కేంద్రానికి తెలియజేశాయి. ఈ అంశ ంలో ట్విట్టర్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. కేంద్రం తీసుకొ చ్చిన నూతన ఐటీ నిబంధనావళి ప్రకారం, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్..మొదలైన సోషల్ మీడియా కంపెనీలు ముగ్గురు కీలకమైన అధికారుల్ని నియమించాలి. చీఫ్ కాంప్లియెన్స్ అధికారి, నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవియెన్స్ అధికారులుగా భారతీయుల్నే నియ మించాలని నిబంధనావళి సూచిస్తోంది. అలాగే సామాజిక మాధ్యమంలో ఖాతాదారుల వివరాలు కూడా కేంద్రం అడుగుతోంది. ఇది భారత రాజ్యాంగంలోని గోప్యతా చట్టాలను ఉల్లంఘించటమేనని వాట్సాప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనావళిని అమలుజేస్తే, ఖాతాదార్ల వ్యక్తిగత గోప్యతను పాటించలేమని వాట్సాప్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.