Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషన్ను ఏర్పాటుచేసిన ఐరాస
- విచారణకు సహకరించేది లేదు ఇజ్రాయెల్ ప్రకటన
న్యూఢిల్లీ : పాలస్తీనాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం(యూఎన్హెచ్ఆర్సీ) ఒక శాశ్వత అంతర్జాతీయ విచారణ కమిషన్ను ఏర్పాటుచేసింది. తూర్పు జెరూసలేం, సహా పాలస్తీనా, గాజా ప్రాంతాల్లో జరిగిన మానవ హననంపై కమిషన్ విచారణ జరపుతుందని యూఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. ఐరాస విచారణకు ఇజ్రాయెల్ సహకరించదని ఆయన ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదలచేశారు.