Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు అధికారులు సస్పెండ్
అలీఘర్ : ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యానికి బలైన వారి సంఖ్య 22కు చేరుకుంది . అలీఘర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు 22 మంది మరణించారు. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. 'మాకు అందిన సమాచారం ప్రకారం, కల్తీ లిక్కర్ తాగి 22 మంది మరణించారు. అయితే అధికారిక నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం' అని అలీఘర్ జిల్లా మేజిస్ట్రేట్ సిబి సింగ్ తెలిపారు. పోస్టుమార్టం గది ఎదుట అనేక మృతదేహాలు ఉండటంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలోని మూడు గ్రామాల్లో లైసెన్స్ పొందిన మద్యం షాపుల నుండే ఈ కలీ ్త మద్యాన్ని సేవించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఎక్సైజ్ అధికారితో పాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, వీరికి మద్యం దుకాణాల నుండి సరఫరా చేసిన ఇద్దరు ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఈ నిందితులపై 50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు.