Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ నుంచి ఛార్జీల పెంపు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు చేరనుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 నిమిషాల కాలానికి రూ.4700, 120-150 నిమిషాల ప్రయాణానికి రూ.6100గా ప్రకటించింది.