Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటాయింపులు నిలిపివేస్తున్నట్టు ప్రకటన
న్యూఢిల్లీ : దేశంలో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి అమలు చేస్తున్న ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు శుక్రవారం నమోదైన కేసుల సంఖ్య దీనిని స్పష్టం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దేశంలో 1.73 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 45 రోజులగా దేశంలో అతితక్కువగా నమోదైన కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. మరణాల సంఖ్య సైతం 4వేల కంటే తక్కువగానే రికార్డయ్యాయి. ఈ మరణాల సంఖ్య 3617గా ఉన్నది. దేశవ్యాప్తంగా 1,73,790 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.77 కోట్లకు పైగా చేరుకున్నది. తాజాగా 3,617 కరోనా మరణాలతో దేశంలో మొత్తం కోవిడ్-19 మృతుల సంఖ్య 3,22,512కు చేరింది. ఇటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 22,28,724కు పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 2,84,601 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20.80 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం శాంపిళ్ల పరీక్షలు 34,11,19,909 గా ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటి వరకు 20.89 కోట్ల మందికి పైగా డోసులు పంపిణీ అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 30.62 లక్షలకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.