Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్
- భారత్ సాయాన్ని ఎన్నటికీ మరువలేం : యూఎస్ సెక్రెటరీ
వాషింగ్టన్, న్యూఢిల్లీ : భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లికెన్లు శుక్రవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై వీరు చర్చించుకున్నారు. ఇందులో కోవిడ్-19 వ్యాక్సిన్, భారత్-చైనా సరిహద్దు సమస్యలు, వాతావరణ మార్పు, ద్వైపాక్షిక సంబంధాలపై ఈ సమావేశంలోకి చర్చకు వచ్చాయి. కాగా, ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం జైశంకర్, బ్లికెన్ను మీడియాతో మాట్లాడారు. యూఎస్ నుంచి వ్యాక్సిన్ కేటాయింపులపై చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ.. ఆ అంశంకు చర్చకు వచ్చినప్పటికీ అందులోకి పూర్తిగా వెళ్లలేదన్నారు. కరోనా కష్టకాలంలో భారత్కు అండగా నిలిచిన అమెరికాకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్ తమకు అండగా నిలిచిందని ఆంటోని బ్లింకెన్ పునరుద్ఘాటించారు. భారత్ సాయాన్ని అమెరికా ఎన్నటికీ మరువలేదన్నారు. ప్రస్తుత ఆపత్కాల సమయంలో భారత్కు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కోవిడ్ మహమ్మారిపై కలిసే పోరాడతామని చెప్పారు. కాగా, అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి క్యాబినెట్ స్థాయి మంత్రి జైశంకర్ కావడం విశేషం. అలాగే, కోవిడ్ టీకాల విషయమై సహాయం కోరుతూ అమెరికాలోని పలువురు ప్రముఖులతో జైశంకర్ చర్చలు జరిపారు. వ్యాక్సిన్ భాగస్వామ్యంపై చర్చించాం
వాషింగ్టన్, న్యూఢిల్లీ : భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లికెన్లు శుక్రవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై వీరు చర్చించుకున్నారు. ఇందులో కోవిడ్-19 వ్యాక్సిన్, భారత్-చైనా సరిహద్దు సమస్యలు, వాతావరణ మార్పు, ద్వైపాక్షిక సంబంధాలపై ఈ సమావేశంలోకి చర్చకు వచ్చాయి. కాగా, ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం జైశంకర్, బ్లికెన్ను మీడియాతో మాట్లాడారు. యూఎస్ నుంచి వ్యాక్సిన్ కేటాయింపులపై చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ.. ఆ అంశంకు చర్చకు వచ్చినప్పటికీ అందులోకి పూర్తిగా వెళ్లలేదన్నారు. కరోనా కష్టకాలంలో భారత్కు అండగా నిలిచిన అమెరికాకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్ తమకు అండగా నిలిచిందని ఆంటోని బ్లింకెన్ పునరుద్ఘాటించారు. భారత్ సాయాన్ని అమెరికా ఎన్నటికీ మరువలేదన్నారు. ప్రస్తుత ఆపత్కాల సమయంలో భారత్కు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కోవిడ్ మహమ్మారిపై కలిసే పోరాడతామని చెప్పారు. కాగా, అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి క్యాబినెట్ స్థాయి మంత్రి జైశంకర్ కావడం విశేషం. అలాగే, కోవిడ్ టీకాల విషయమై సహాయం కోరుతూ అమెరికాలోని పలువురు ప్రముఖులతో జైశంకర్ చర్చలు జరిపారు.