Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : సీపీఐ(ఎం) నేత, ఐద్వా మాజీ ఉపాధ్యక్షురాలు మైథిలీ శివరామన్ (81) చెన్నైలో ఆదివారం కన్నుమూశారు. అల్జీమర్ వ్యాధి సోకడంతో జ్ఞాపక శక్తి కోల్పోయిన ఆమె...గత 10 సంవత్సరాలుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ మైథిలి..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త కరుణాకరన్, కుమార్తె కల్పనా కరుణాకరన్ ఉన్నారు. తూర్పు తంజావులోని క్వింజెవన్మనీ దళితుల ఊచకోతపై తన రచనల ద్వారా అక్కడ ప్రజలను మేలు కొల్పారు. సామ్రాజ్య వాదం, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారని మైథిలి స్నేహితుడు, మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కె. చంద్రు రాసిన తమిళ పుస్తకం 'ఆర్డర్ ఆర్డర్'లో పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితమిచ్చారు.