Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్ల బీజేపీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీట్
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ పాలనకు ఏడేండ్లు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏడు పాయింట్లతో కూడిన ఒక ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. మోడీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనంతా తిరోగమనం దిశగా సాగుతున్నదని విమర్శించింది. వర్చువల్‌గా ఛార్జిషీట్ విడుదల సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగం ఇన్‌ఛార్జి రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో సాధించిన ఆర్థికపరమైన విజయాలను బిజెపి ప్రభుత్వం తిరోగమన బాట పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ఛార్జీషీట్‌లోని ముఖ్యాంశాలు
- నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల ఏమాత్రం పట్టన్నట్లు కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
- దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి గత 73 ఏండ్ల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వమే అత్యంత బలహీనమైనది.
- ద్రవ్యోల్బణం పెరుగుదల ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. సామాన్యుడికి నిత్యం అవసరమైన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ల ధరలు ఆకాశానంటుతున్నాయి.
- ఈ ప్రభుత్వం పేదరికంపై కాకుండా పేదలపై యుద్ధం చేస్తూ, వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తోంది.
- దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపుతోంది. వ్యాక్సిన్ల కొరత ఎందుకు నెలకొందో చెప్పాలి. ఒకవేళ మనకే సరిపడా వ్యాక్సిన్లు లేకుంటే ఇతర దేశాలకు దాదాపు 6.63 కోట్ల మేర వ్యాక్సిన్లను ఎందుకు ఎగుమతి చెప్పాలి.