Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు వైఫల్యాలపై ఆసక్తికర పోస్టులు
- వాస్తవ ఘటనలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న వైనం
న్యూఢిల్లీ : ఏదైనా సంఘటనపై ఒక ఫోటో వివరించినంతగా మరేది పాఠకులను ఆకర్షించలేదు. అందుకే వార్తాపత్రికల్లో కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ ఆలోచింపజేస్తూ ఉండే ఫోటోలకు ఆదరణ లభిస్తుంటుంది. ముఖ్యంగా, రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి వాటికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే తీరులో కరోనా విషయంలో మోడీ సర్కారు వైఫల్యాలపై 'పెన్పెన్సిల్డ్రా' కు చెందిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ప్రజలను, నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కేంద్రం వైఫల్యాలు, కరోనాను రాజకీయంగా వాడుకుంటున్న తీరు, మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటంలో చూపిన నిర్లక్ష్యం వంటి పలు అంశాలకు సంబంధించిన చిత్రాలను 'పెన్పెన్సిల్డ్రా' పోస్టులను షేర్ చేస్తున్నది. వీటిగురించి ప్రజల్లో ఆలోచనలను రేకెత్తిస్తున్నది. 'పెన్పెన్సిల్డ్రా' పేజీకి ప్రస్తుతం ట్విట్టర్లో 26,500కు పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 15,400కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
పెన్పెన్సిల్డ్రా తన తొలి పోస్టును గతేడాది ఏప్రిల్5న షేర్ చేసింది. ఇందులో లాక్‌డౌన్‌కు సంబంధించి మోడీ సర్కారు తీరు వ్యవహరించిన తీరును ఆలోచింపజేస్తూ చిత్రాన్ని పోస్టు చేసింది. అలాగే, మహమ్మారి తొలి దశ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, అసోం ఆరోగ్య మంత్రి ఇలా పలువురు బీజేపీ ప్రముఖులు కరోనా వైరస్‌తో పాటు పలు అంశాలపై చేసిన విషయాల గురించి, వారు ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో దేశంలో ఉన్న కేసులను ఒక గ్రాఫ్ రూపంలో పొందుపరుస్తూ పెట్టిన పోస్టు చాలా మందిని ఆకర్షించింది. ముఖ్యంగా, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని దేశం రక్షించిందంటూ ఈ ఏడాది జనవరి 28 దేశంలో 50వేల కంటే తక్కువ సంఖ్యలో కేసులున్న సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను, అలాగే దేశంలో రెండు లక్షల కేసులు నమోదైనప్పుడు ఏప్రిల్ 17న కుంభమేళాను పొగుడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలను వివరిస్తూ గ్రాఫ్‌లో పొందుపర్చిన విధానం నెటిజన్లకు సులువుగా అర్థమయ్యేవిధంగా ఉన్నది. కాంగ్రెస్ టూల్ కిట్‌ను తెరపైకి తెస్తూ ట్విట్టర్‌పై మోడీ-షా ద్వయం ఆరోపణలు చేస్తూ కరోనా మరణాలను దాస్తున్న విధానాన్ని కూడా 'పెన్పెన్సిల్డ్రా' తన చిత్రాలతో వివరించింది.