Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో మరణించే ముప్పు 50 శాతం వరకు ఉంటుంది : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
న్యూఢిల్లీ : ధూమపానం చేసేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేదు వార్తను వెల్లడించింది. కరోనా వల్ల మరణించే ముప్పు వారిలో 50 శాతం వరకు అధికంగా ఉంటుందని ఆ సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధొనామ్ ఘెబ్రియేషస్ హెచ్చరించారు. అలాగే, క్యాన్సర్, గుండె సంబంధ, శ్వాసకోశ వ్యాధులు వృద్ధి చెందే ప్రమాదం ఉన్నదని చెప్పారు. 'కమ్మిట్ టూ క్విట్' అనే టొబాకో నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ధూమపానాన్ని వీడటమే చక్కటి మార్గమని చెప్పారు. '' టొబాకో రహిత వాతావరణం కోసం డబ్యూహెచ్ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొని తమవంతు పాత్ర పోషించాలని అన్ని దేశాలను మేము కోరుతున్నాం. దీంతో టొబాకోను వీడటానికి ప్రజలకు కావాల్సిన సమాచారం, మద్దతు, టూల్స్ అందుతాయి'' అని అధోనామ్ తెలిపారు. క్విట్ ఛాలెంజ్ పేరిట వాట్సప్, ఫేస్బుక్, వైబర్, వీచాట్లో కావాల్సిన సమాచారం అందుతుందని చెప్పారు.