Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణా లు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24గంటల్లో 1,65,553కేసులు నమోద య్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,78,94,800లకు పెరిగాయి. కొత్తగా 2,76,309 కోలుకోవడంతో ఆ సంఖ్య 2,54,54,320కి చేరింది. ప్రస్తుతం ó21,14,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుండగా, కరోనా బారినపడి కొత్తగా 3,460 మంది మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,25,972 పెరిగింది. ప్రస్తుతం మరణాల రేటు 1.17 శాతం, రికవరీ రేటు 91.25 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10 శాతంలోపు నమోదైంది. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 34,31,83,748 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 20,63,839 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి 21,20,66,614 కరోనా టీకాలు వేశారు. గత 24 గంటల్లో మొత్తం 30,35,749 టీకాలు పంపిణీ చేశారు.