Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగం పెరుగుతుంది : రాయిటర్స్ పోల్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కేసులు రెండు లక్షలకు దగ్గరగా వెలుగుచూస్తున్నా.. మరణాలు మాత్రం దాదాపు 4 వేలకు దగ్గరగా నమోదవుతున్నాయి. రాబోయే కాలంలో కరోనా మరణాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశముందనే అంచనాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ బలహీన పడిందనీ, ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సంక్షోభం మరింత దారుణంగా దిగజారవచ్చని రాయిటర్స్ పోల్ వెల్లడించింది. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా ఆం క్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలా పాలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ఉపాధికి దూరమయ్యారు. ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. దీంతో రేటింగ్ సంస్థలు, ఆర్థికవేత్తలు ఇదివరకటి ఆర్థిక వృద్ధి ఆంచనాలను సవరిస్తూ.. తగ్గించారు. మే 20-27 రాయిటర్స్ పోల్ ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక వృద్ధి దృక్పథాన్ని వార్షికంగా 21.6 శాతానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సర సగటును 9.8 శాతానికి తగ్గించింది. గత నెలలో ఈ అంచనాలు వరుసగా 23.0, 10.4 శాతంగా ఉన్నాయి. ఇంతకు ముందు అంచనా వేసిన 6.5 శాతంతో పోలిస్తే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.7 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. ''భారత్‌లో సెకండ్‌వేవ్‌కు ముందు నెలల్లో ఆర్థిక రికవరీ బలంగా కనిపించింది.
కరోనా కేసులు తగ్గిపోయిన తర్వాత ఆర్థిక రికవరీ వేగంగా పుంజుకుంటుదనే నమ్మకాన్ని కలిగించింది. అయితే, ఈ ఏడాదిలో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే వ్యాక్సినేషన్ అమలు వేగం పెంచాల్సిన అవసరముందని'' రాబోబ్యాంక్ ఆర్థికవేత్త ఉటర్ వాన్ ఐజ్కెలెన్బర్గ్ అన్నారు. ఈ ఏడాదిలో వ్యాక్సినేషన్ నెమ్మదిస్తే.. వృద్ధి సగటున 6.8 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన సీనియర్ ఆసియా ఆర్థికవేత్త గారెత్ లెదర్ అన్నారు.