Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి (84)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎల్గర్ పరిషద్ కేసులో మావోయిస్టులతో సంబం ధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన నిందితుడిగా ఉన్న విషయం విదితమే. ఈ మేరకు ఆయనకు కోరనా సోకిన విషయాన్ని ఆయన తరఫు లాయర్ మిహిర్ దేశారు వెల్లడించారు. దీనిని తలోజా జైలు అధికారులు '' క్రిమినల్ నెగ్లిజెన్స్''గా దేశారు ఆరోపించారు. ఖైదీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోలేదనీ, సమయానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమయ్యారని తెలిపారు. పార్కిన్సన్తో వ్యాధితో పాటు ఇతర వ్యాధులతోనూ ఆయన ప్రస్తుతం బాధను అనుభవిస్తు న్నారు. దీంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను నవీ ముంబయిలోని తలోజా జైలు నుంచి హౌలీ ఫ్యామిలీ హాస్పటల్‌కు ఈనెల 28న తరలించారు. ఎల్గర్ పరిషద్ కేసులో గతేడాది అక్టోబర్‌లో అరెస్టయినప్పటి నుంచి తలోజా జైలు ఆస్పత్రిలోనే స్వామి ఉన్నారు.