Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫతేపూర్(యూపీ): గంగా నదిలో మృతదేహాలు తేలుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ వద్ద నదిపై తేలియాడుతున్న ఆరు కరోనా అనుమానిత మృతదేహాలను గుర్తించినట్లు ఫతూపూర్ సాదర్ తెహ్సిల్ సబ్ కలెక్టర్(ఎస్డిఎం) ప్రమోద్ ఝా సోమవారం వెల్లడించారు. నదిలో మృతదేహాల గురించి తనకు ఆదివారం ఉదయం సమాచారం వచ్చిందని, అనంతరం అక్కడకు చేరుకొని, కుళ్లిపోయిన ఆ ఆరు మృతదేహాలను బయట కు తీయించామని తెలిపారు. అనంతరం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భిటోరా గంగాఘాట్ వద్దనే ఒకవైద్యుల బృందం అంత్యక్రియలు నిర్వహించిం దని పేర్కొన్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నందున, అవి ఎవరి వో గుర్తించలేకపోయామని, చాలా సుదూర ప్రాంతం నుంచి అవి కొట్టుకు కొని ఇక్కడకు వచ్చాయని భావిస్తున్నామని ఎస్డిఎం తెలిపారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో గంగా నది ఒడ్డుకు అనేక మృతదే హాలు ఒడ్డుకు కొట్టుకురావడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.