Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు కార్మికులు మృతి
గౌహతి : మేఘాలయలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో ఉన్న ఒక బొగ్గు గనిలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించి నట్టు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు. మృతుల స్నేహితుల్లో ఒకరు అసోంలోని చాచర్ జిల్లా పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లా పోలీసులతో చాచర్ జిల్లా పోలీసులు ఈ విషయంపై సంప్రదిస్తున్నారని అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా తెలిపారు. 2014 ఏప్రిల్‌లో ప్రమాదకరమైన రాత్హోల్ కోల్ మైనింగ్‌ను మేఘాలయాలో ఎన్జిటి నిషేధించింది. అయితే అధికారులకు తెలిసే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కొనసాగుతున్నదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబరులో అక్రమ మైనింగ్‌లో 17 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది అసోంకు చెందినవారే.