Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 185వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
న్యూఢిల్లీ: .దేశ రాజధాని ఢిల్లీ-హర్యానా సరిహద్దు టిక్రీ వద్ద జరుగుతున్న రైతు ఉద్యమంలో పంజాబ్‌కు చెందిన రైతులు భారీగా తరలివచ్చి భాగస్వా ములయ్యారు. పంజాబ్‌లోని ఆలిండియా కిసాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా '' కిసాన్ ఏక్తా జిందాబాద్, కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్, మోడీ సర్కార్ డౌన్ డౌన్, నల్ల చట్టాలు రద్దు చేయాలి'' అంటూ నినాదాలతో రైతులు హౌరెత్తించారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతూనే ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం సోమవారం నాటికి 185వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు.