Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్‌డౌన్‌వేళ..8రోజులు..1200 కి.మీ సైకిల్‌పై ప్రయాణం
- కాలు విరిగిన నాన్నను స్వగ్రామం చేర్చిన జ్యోతికి ప్రశంసలు
దర్భంగా: బీహార్‌లోని దర్భంగాకు చెందిన సైకిల్ అమ్మాయి జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాస్వాన్ గుండెపోటుతో మరణించారు. స్థానిక గ్రామమైన సిర్హుల్లిలో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. మోడీ సర్కార్ తొలిసారి విధించిన లాక్డౌన్ కారణంగా బతుకులు చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో జ్యోతి తండ్రి మోహన్ పాస్వాన్ ఢిల్లీలో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రోడ్డు ప్రమాదంలో అతని మోకాలు విరిగింది. గాయాలు నయమయ్యాయి. కానీ అనారోగ్యం అతడ్ని వెంటాడింది. తమ వద్ద ఉన్న రేషన్,డబ్బులు అయిపోయాయి. ఇక్కడే ఉంటే ఆకలితో చనిపోతామన్న భయం జ్యోతిని నిద్రలేకుండా చేసింది. తన ముందుఉన్న ఏకైక మార్గం ఇంటికి తిరిగి రావటం..అప్పుడు జ్యోతికి 13 ఏండ్లే. ఎలాగైనా నాన్నను బతికించుకోవాలని తండ్రిని సైకిల్ వెనుక సీటుపై కూర్చొపెట్టుకున్న జ్యోతి గురుగ్రామ్ నుంచి 8 రోజుల్లో 1200 కిలోమీటర్ల దూరంలో తన గ్రామంలోని దర్భంగా చేరుకున్న విషయం విదితమే. జ్యోతి తెగువను ప్రపంచమీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. 15 ఏండ్ల జ్యోతి కుమారి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని వారం రోజుల్లో 1,200 కిలోమీటర్ల సైక్లింగ్ ద్వారా తన గ్రామానికి తీసుకెళ్లిందని ఇవాంకా ఒక ట్వీట్లో రాశారు. ఇది భారతీయుల సహనానికి, వారి అంతులేని ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నది. జ్యోతి లక్షలాది మంది అమ్మాయిలకు ప్రేరణ అంటూ వారిపై సినిమా తీయాలని వినోద్ కప్రి వారితో ఒప్పందం కూడా చేసుకున్నాడు. జ్యోతి ప్రదర్శించిన ధైర్యానికి మెచ్చి ప్రధానమంత్రి జాతీయ చైల్డ్ అవార్డు 2021 ప్రకటించారు. అయితే అవార్డుతో జ్యోతిని సత్కరించాల్ని ఉన్నది. ఈలోపు జ్యోతి తండ్రి మరణించటంతో..వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆ ఇంట్లో పూట గడవటం కూడా కష్టమయ్యేపరిస్థితి ఎదురైంది. తన కుటుంబానికి సహాయం చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.