Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ తేజస్వీ సూర్య, ఎమ్మెల్యే రవిలపై ఆరోపణలు
- ఆడియో క్లిప్ బయటకు.. అరెస్టుకు కాంగ్రెస్ డిమాండ్
- ఎంపీ తేజస్వీ సూర్య, ఎమ్మెల్యే రవిలపై ఆరోపణలు
- ఆడియో క్లిప్ బయటకు.. అరెస్టుకు కాంగ్రెస్ డిమాండ్
బెంగళూరు : కర్నాటకలో కరోనా వ్యాక్సిన్లలో అవకతవకల విషయంలో అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బంధువు, బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం కోవిడ్-19 వ్యాక్సిన్ల విషయంలో కమీషన్లు పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఓ ఆడియో క్లిప్‌లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో '' నోట్ ఫర్ వ్యాక్సిన్'' వ్యవహారంలో తేజస్వీ సూర్య, రవి సుబ్రమణ్యలు కమీషన్లు పొందుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. వారిద్దరి అరెస్టుకు డిమాండ్ చేసింది. కాగా, వ్యాక్సిన్లకు సంబంధిచిన కమీషన్ వ్యవహారం ఆడియో క్లిప్ రూపంలో ఇటీవలే బయటపడింది. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. తన కొడుకుకు వ్యాక్సిన్ వేయించే విషయమై సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఎంక్వైరీ చేశారు. అయితే, బెంగళూరులోని బలసవనగుడిలోని ఏవీ ఆస్పత్రికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ ఒక్క డోసు చొప్పున ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యకు రూ.700 చెల్లించాల్సిన విషయాన్ని వెల్లడించింది. మరోపక్క, ఈ విషయమై సదరు సామాజిక కార్యకర్త తేజస్వీ సూర్య, రవి సుబ్రమణ్యలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు 'ఇండియా టుడే' పేర్కొన్నది. కాగా, ఈ ఆరోపణలను ఎమ్మెల్యేతో పాటు, సంబంధిత ఆస్పత్రి యాజమాన్యం తోసిపుచ్చింది.
బెంగళూరు దక్షిణ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య మామ రవి సుబ్రమణ్య. 'బీబీఎంపీ బెడ్ స్కాం' కేసులో ఈ ఇద్దరు బీబీఎంపీ సౌత్ వార్ రూం సిబ్బందిని ప్రశ్నిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 'ఒక వర్గం వారినే ఇందులో నియమిస్తున్నారా? వీరంతా ఎవరూ?' అంటూ సదరు వీడియోలో ఎంపీ, ఎమ్మెల్యేలు సిబ్బందిని ప్రశ్నించారు. కాగా, బెడ్ స్కాం కేసును మతం కోణంలో హైలెట్ చెయ్యాలని వీరు ప్రయత్నించారని కాంగ్రెస్ ఆరోపణలు కూడా చేసింది.