Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు
- ముంబయిలో ఆల్‌టైం రికార్డు ధర.. లీటరు పెట్రోల్ రూ.100.47
- ఒక్క నెలలో అత్యధిక సార్లు ఇంధన ధరల పెంపు
- ముంబయిలో సెంచరీ దాటి పరుగులు
- మే నెలలో 16వ సారి పెరుగుదల
న్యూఢిల్లీ : పెట్రో ధరలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇటు దేశంలోని సామాన్య ప్రజలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోమవారం చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజీల్‌పై 28 పైసలు ఎగబాకాయి. ఫలితంగా ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే పెట్రో ధరలు 16 సార్లు పెరిగినట్టయ్యింది. వాణిజ్య రాజధాని ముంబయిలో అయితే లీటర్ పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ మార్కును దాటి పరుగులు పెడుతున్నది. దేశంలోని పలు ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇంధన ధరలూ ఈ విధంగానే నమోదయ్యాయి. ప్రభుత్వ చమురు సంస్థల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.23గా, డీజీల్ ధర రూ. 85.15గా నమోదైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.40గా, డీజీల్ ధర రూ.92.45 గా రికార్డయ్యింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.76గా, డీజీల్ ధర రూ. 89.90 కు ఎగబాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.25కు, డీజీల్ ధర రూ. 88.00 కు చేరి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలపై 30 పైసలు పెరిగి ధర రూ. 97.93గా నమోదైంది. ఇక డీజీల్‌పై 29 పైసలు పెరిగి రూ. 92.83కు చేరుకున్నది. కాగా, మేనెలలో 16 సార్లు పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్‌పై రూ. 3.54, డీజీల్‌పై రూ.4.16 లు ఎగబాకాయి. కరోనా కష్టకాలంతో ఈ విధంగా పెరిగిన చమురు ధరల విషయంలో మోడీ సర్కారుపై సామాన్యప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.