Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టీకాల కోసం రాష్ట్రాలు ఎందుకు అధిక ధర చెల్లించాలంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రానికి ధరను నిర్ణయించే అధికారం ఉందని చెబుతూ.. ఈ అంశాన్ని తయారీ సంస్థలకు ఎందుకు వదిలేసింది? అంటూ ప్రశ్నించింది. దేశంలో ఒకే ధర ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలంది. టీకాల కోసం తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానం పలకడాన్ని ప్రశ్నిస్తూ.. 'కేంద్రం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోందా? విదేశాల నుంచి రాష్ట్రాలు టీకాలను పొందడం ఆచరణాత్మకం కాదు. ఈ విషయాన్ని గాలికి వదిలివేయడంతో.. రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయంది.