Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అల్లోపతి(ఆధునిక వైద్య చికిత్స)పై యోగాగురువు రామ్‌దేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు మంగళవారం 'బ్లాక్ డే' పాటించారు. అల్లోపతి ఒక స్టుపిడ్ సైన్స్ అంటూ రామ్‌దేవ్‌బాబా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అల్లోపతి వైద్యంతో పాటు వైద్యులపై విచక్షణారహితంగా, అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను పలు వైద్య సంఘాలు ఈ సందర్భంగా ఖండించాయి. రామ్‌దేవ్ బాబా బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అల్లోపతి వైద్యంపై అశాస్త్రీయ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) తప్పుపట్టింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా బ్లాక్‌డే పాటించాలని వైద్య సంఘాలు ఈ పిలుపునిచ్చాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కూడా ఈ నిరసనలకు మద్దతు పలికింది.