Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 శాతానికి చేరిక : సీఎంఐఈ
న్యూఢిల్లీ : ఉపాధి లేక పట్టణ వాసుల పరిస్థితి దారుణంగా మారుతున్నది. ఈ ప్రాంతాల్లోని ప్రజల్లో 18 శాతం నిరుద్యోగులుగా మారారు. వరుసగా ఏడు వారాలుగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగింది. మే 30తో ముగిసిన వారంలో నిరుద్యోగుల శాతం 17.88 శాతానికి ఎగిసింది. మే 23 నాటికి ఇది 13.51 శాతంగా ఉంది. లాక్డౌన్ నిబంధనలతో ఉపాధి కరువైందని సెంటర్ ఫర్ మానిటరీంగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. సీఎంఐఈ ప్రకారం.. మే 30తో ముగిసిన వారంలో దేశంలో స్థూల నిరుద్యోగిత స్థాయి 12.15 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 9.58 శాతంగా ఉన్నది. రెండో దశ కరోనా వల్ల పట్టణ నిరుద్యోగం 1.5 రెట్లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత పరిస్థితి పర్వాలేదనీ.. పట్టణ ప్రాంతాల్లో చాలా ఒత్తిడి నెలకొందని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పట్టణ ప్రాంతాల్లో 7.21 శాతం, గ్రామాల్లో 8.58శాతం చొప్పున దేశంలో స్థూలంగా 8.16శాతంగా నిరుద్యో గం నమోదయ్యిందన్నారు. ఇది మేలో మరింత పెరిగిందన్నారు. లాక్డౌన్ నిబంధనలతో అనేక పరిశ్రమలు మూత పడటం, నిర్మాణ రంగ కార్యకలా పాలు నిలిచిపోవడంతో ఉపాధి భారీగా దెబ్బతిందని సెంటర్ ఫర్ ఎకనామిక్ డాటా అండ్ అనలసిస్ (సీఈడీఏ) ఆశ్విని దేశ్‌పాండే పేర్కొన్నారు. ఆత్మనిర్బా ర్ పేరుతో పారిశ్రామికవేత్తలకు భారీగా సబ్సీడీలు ఇస్తున్న మోడీ సర్కార్ నిరుద్యోగం నివారణకు మాత్రం పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని నిపుణు లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వలస కార్మి కులకు కనీస భరోసాను ఇవ్వలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.