Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : దేశంలో రోజువారీ సగటు విద్యుత్ వినియోగం ఏప్రిల్ నెల కన్నా మే నెలలో 10.4 శాతం పడిపోయిందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. కరోనాసెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యుదుత్పాదన సగటు ఏప్రిల్ నెలలో 4,074 యూనిట్లు ఉండగా, మే నెల నాటికి 3,664 యూనిట్లకు పడిపోయిందని ఫెడరల్ గ్రిడ్ రెగ్యులేటర్ పోస్కో నివేదిక విశ్లేషించింది. అయితే మే నెల చివరి వారం నుండి విద్యుదుత్పాదకత కొంతమేర పెరగడం ప్రారంభమైందని తెలిపింది. సాధారణంగా దేశంలో మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు అధికంగా ఎసిలు, కూలర్లు వినియోగిస్తుంటారు. అలాగే ఫ్యాక్టరీల కార్యకలాపాలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో మే నెలలో విద్యుత్ వినియోగం కూడా అధిక స్థాయిలో ఉంటుంది. అయితే మూడొంతుల కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏప్రిల్ కంటే మే నెలలో తక్కువ విద్యుత్‌ను వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది లాక్డౌన్ విధించడంతో మే నెలలో విద్యుత్ వినియోగం 7.2 శాతం కన్నా పెరిగింది. అదే సమయంలో కఠిన ఆంక్షలు అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం, ఢిల్లీల్లో గతేడాది ఇదే సమయంలో తక్కువ విద్యుత్‌ను వినియోగించినట్లు స్పష్టమైందని నివేదక తెలిపింది.