Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు విద్యాశాఖ మంత్రి
చెన్నై: తమిళనాడులో 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమొజ్జి తెలిపారు. పరీక్షలను నిర్వహించాలా..వద్దా.. అనే దానిపై సిఎం సంబంధిత వ్యక్తుల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుం టారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే వైద్య నిపుణులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు కోరిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అభిప్రాయాలన్నింటినీ పరిశీలించిన సిఎం స్టాలిన్ పరీక్షల నిర్వహణపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బోర్డు పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏం నిర్ణయం తీసుకున్నాయన్న దానిపై కూడా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు ముఖ్యమని, ఇదే సమయంలో వారి అరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అంబిల్ మహేష్ పేర్కొన్నారు.