Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కన్నా 10 డిగ్రీలు తక్కువగా నమోదైం దని అన్నారు. ఇప్పటివరకు జూన్ నెలలో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ తెలిపింది. 2006 జూన్‌లోనూ ఇదే తరహాలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్ కాగా, సాధారణం కన్నా ఏడు డిగ్రీలు తక్కువని పేర్కొంది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవు తున్నాయని ఐఎండి అధికారి తెలిపారు. మంగళ వారం 15.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. బుధవారం కూడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.