Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : 2013 అత్యాచార కేసులో జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తేజ్పాల్ను నిర్ధోషిగా ప్రకటిస్తూ గోవా సెషన్స్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై బాంబే హైకోర్టును గోవా ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తేజపాల్కు వ్యతిరేకంగా ఇచ్చిన ఆధారాలను సెషన్స్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్లో గోవా ప్రభుత్వం ఆరోపించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు గోవా బెంచ్ తేజ్‌పాల్‌కు నోటీసులు ఇచ్చింది. తేజ్పాల్ను నిర్ధోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు 'అత్యాచార బాధితులకు మాన్యువల్‌గా ఉంది' అని విమర్శించింది. ఇలాంటి కేసుల్లో బాధితులు ఎలా స్పందించవచ్చో చెప్పే విధంగా ఈ తీర్పు ఉందని పేర్కొంది.