Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతి ప్రక్రియలో డిసిజిఐ మార్పులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ టీకాల కొరతను అధిగమించేదుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియలో భారత ఔషద నియంత్రణ మండలి(డిసిజిఐ) బుధవారం మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని తెలిపింది. కొన్ని దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఒ) ఆమోదించిన కొవిడ్-19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 'ప్రపంచ ఆరోగ్య సంస్థలో నమోదైన అమెరికా, ఇంగ్లండ్, జపాన్ వంటి దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలకు భారత్‌లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు. వీటికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చాం. ఇవి భారత్‌లో అనుమతుల కోసం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ లేబోరేటరీ బ్రిడ్జ్ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే దిగుమతి అయ్యే టీకాలు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబరేటరీల ధ్రువీకరణను పొంది ఉండాలి' అని డిసిజిఐ తన ప్రకటనలో తెలిపింది. గతంలో కొవిడ్-19పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ ఆడ్మిన్స్ట్రేషన్ చేసిన సిఫార్సుల మేరకు డిసిజిఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఫైజర్, మోడెర్నాలు ఇండ్నెమ్నిటీ కోరడంతోపాటు.. స్థానికంగా ప్రయోగ పరీక్షలు చేపట్టకుండానే అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొన్న సంస్థల టీకాలు దేశంలో అనుమతించాలంటే ఇక్కడ బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో డిసిజిఐ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.