Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముజఫర్‌పూర్ (బీహార్) : అధునిక వైద్యం, వైద్యులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన బాబా రామ్‌దేవ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీహార్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. దాఖలయింది. ముజఫర్‌పూర్ జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి తన లాయర్ సుధీర్ కుమార్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలు మోసపూరితమైనవని, దురుద్దేశపూరితంగా ఉన్నాయని, అతనిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపిసిలోని దేశద్రోహం, మోసాలకు చెందిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పిటిషన్‌దారు ఉ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 7న విచారణ చేయనుంది.