Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిరోజ్బాద్ కలెక్టర్ ఆదేశాలు
లక్నో : వ్యాక్సిన్ వేయించుకోకుంటే నెల జీతం కట్ చేస్తామంటూ యుపిలోని ఫిరోజ్బాద్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనను అమలు చేయాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర విజరు సింగ్ అధికారులను మౌఖికంగా ఆదేశించారని చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్ చర్చిత్ కౌర్ బుధవారం తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులపై అవసరమైన విచారణ చేపట్టడంతో పాటు ఆ నెల జీతం చెల్లించడాన్ని నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు, సంబంధిత ఉన్నతాధికారులకు నోటీసులు వెళ్లాయని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ నిబంధన ప్రభావం చూపిస్తోందని.. పలువురు ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.