Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం బుధవారం నాటికి 187వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు.
హర్యానాలో రైతులపై లాఠీచార్జ్, అరెస్టు
హర్యానాలో రైతులపై మళ్లీ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హర్యానాలోని తోహానాలో జెజెపి ఎమ్మెల్యే దేవేందర్ బాబ్లికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. తోహానాలో రైతుల అరెస్టులకు నిరసనగా హర్యానాలో రైతులు రోడ్లను దిగ్బంధించారు. హిస్సార్‌లోని మజ్రా పియావులో రోడ్డును రైతులు అడ్డుకున్నారు. జెజెపి ఎమ్మెల్యే దేవిందర్ బాబ్లి రైతులను వేధించారని, రైతులపై లాఠీచార్జ్ చేయించారని రైతు నేత గురునామ్ సింగ్ చాదుని పేర్కొన్నారు. లాఠీచార్జ్ కు వ్యతిరేకంగా గురువారం ఆందోళనలకు పిలుపునిచ్చారు