Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : దేశంలోని ఐటి సంస్థ రూపొందించిన నిబంధనలపై గూగుల్ ఎల్ఎల్సి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలు 'సెర్చ్ ఇంజిన్' కు ఆమోదయోగ్యం కాదని గూగుల్ ఎల్ఎల్సి వాదిస్తోంది. ఇంటర్నెట్ నుండి అభ్యంతరకరమైన కంటెంటెను తొలగించాల్సి వచ్చినపుడు ఈ నిబంధనలు సంస్థను ఇబ్బందులకు గురిచేస్తాయని.. దీంతో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరింది. కొందరు దుండగులు ఒక మహిళకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేసినపుడు వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఆదేశాలు అడ్డంకిగా మారతాయని తెలిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. వెబ్సైట్ నుండి ఆ ఫొటోలను తొలగించలేకపోయామని, దీంతో తప్పుచేసిన వారిని శిక్షించే అవకాశం లేకపోగా, ఆ ఫొటోలను ఇతర సైట్లకు పోస్ట్ చేసే అవకాశం కలిగిందని వెల్లడించింది. గూగుల్ పిటిషన్‌పై జులై 25లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫేస్బుక్, అశ్లీల వెబ్‌సైట్‌తో పాటు మహిళకు చీఫ్‌జస్టిస్ డిఎన్.పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నోటీసులిచ్చింది. అలాగే ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 20న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కొత్త నిబంధనల ప్రకారం.. సెర్చ్ ఇంజిన్‌ను సోషల్ మీడియా మధ్యవర్తిగా తప్పుగా పేర్కొందని గూగుల్ వాదించింది. కొత్త నిబంధనల్లో సెర్చ్ ఇంజిన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని, తప్పుగా అన్వయించారని గూగుల్ తన పిటిషన్లో పేర్కొంది. ఐటి చట్టంలోని వివిద విభాగాలకు నిర్దేశించిన ప్రత్యేక నియమాలను కలిపి వాటన్నింటిని ఏకపక్షంగా అన్ని విభాగాలకు వర్తించేలా ఏప్రిల్ 20న ఉత్తర్వులను ఇచ్చారని, ఇది చట్టప్రకారం.. సరికాదని గూగుల్ తన పిటిషన్లో పేర్కొంది.