Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరవడంపై పాలస్తీనా అసంతృప్తి
న్యూఢిల్లీ : పాలస్తీనాపై తాజా తీర్మానం సమయంలో భారత్ గైర్హాజరవడం వల్ల ప్రజలందరి మానవ హక్కులు అణచివేతకు గురయ్యాయని పాలస్తీనా విదేశాంగ మంత్రి డాక్టర్ రియాద్ మల్కి వ్యాఖ్యానించారు. ఈ మేరకు మే 30వ తేదీన విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అసాధారణ లేఖ రాశారు. ''తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవతా సాయం చట్టాలకు గౌరవం కల్పించడానికి హామీ కల్పించడమన్న'' శీర్షికతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సుదీర్ఘకాలం బహుముఖ చర్చలు జరిపిన అనంతరం ఈ తీర్మానాన్ని రూపొందించారు. జవాబుదారీతనం, న్యాయం, శాంతి స్థాపన దిశగా నడిచే దారిలో చాలా కీలకమైన, ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న ఇంతటి ముఖ్యమైన తరు ణంలో అంత ర్జాతీయ సమాజంతో చేతులు కలిపే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. మే 27న మానవ హక్కుల మండలి సమావేశంలో తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఇటీవల ఇజ్రాయిల్ దురాక్రమణ పూరిత దాడులపై దర్యాప్తునకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానాన్ని రూపొందించారు. 24మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయగా, 9మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్‌తో సహా 14మంది గైర్హాజరయ్యారు.