Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్‌వేవ్ కంటే థర్డ్‌వేవ్ ముప్పెక్కువే..
- అప్రమత్తమై చర్యలు తీసుకుంటే మరణాలు తగ్గించవచ్చు : ఎస్బీఐ
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇప్పటికీ గజగజ వణికిస్తోంది. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విరుచుకుపడుతూ నిత్యం లక్షల మందికి సోకుతూ.. వేల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇలాంటి తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించిన రిపోర్టు వివరాలు అందోళన కలిగిస్తున్నాయి. రాబోయే కరోనా థర్డ్‌వేవ్ 98 రోజుల పాటు ఉంటుందనీ, దీని ప్రభావం సెకండ్ వేవ్ కంటే అధికంగా ఉంటుందని పేర్కొంది. కరోనా థర్డ్‌వేవ్‌పై ఎస్బీఐ ఎకోరాప్ పేరిట బుధవారం విడుదల చేసిన రిపోర్టు వివరాలు ఇలా ఉన్నాయి... కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్‌వేవ్ కూడా అంతే తీవ్ర ప్రభావం చూపవచ్చునని పేర్కొంటూ థర్డ్‌వేవ్ ప్రభావం, దాని లక్షణాలు, ఎన్ని రోజులు ఉండవచ్చు అనే పలు అంశాలను నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా పరిస్థితులను బట్టి చూస్తే కరోనా థర్డ్‌వేవ్ సెకండ్ వేవ్‌తో పోలిస్తే పీక్ స్థాయిలో 1.8 రెట్లు అధికంగా ఉండవచ్చునని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్ 5.2 రెట్లు అధికంగా ఉంది. థర్డ్‌వేవ్ దాదాపు 98 రోజుల పాటు ఉండవచ్చు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో థర్డ్‌వేవ్ ప్రభావం దాదాపు ఇంతే సమయం ఉందని తెలిపింది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌ను 108 రోజులు ఉండగా.. దానికంటే 10 రోజులు తక్కువగా థర్డ్‌వేవ్ ఉంటుందని అంచనా వేసింది. అయితే, సెకండ్‌వేవ్ మరణాలతో పోలిస్తే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఇప్పుడే అప్రమత్తమై చర్యలు తీసుకుంటే మరణాలు తగ్గించవచ్చునని సూచించింది. కరోనా సెకండ్‌వేవ్‌లో ఇప్పటివరకు దేశంలో 1.7లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే, థర్డ్‌వేవ్‌కు ముందే అప్రమత్తమై చర్యలు తీసుకుంటే 40 వేలకే పరిమితం చేయవచ్చునని తెలిపింది. థర్డ్‌వేవ్ చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. దేశంలోని 12-18 ఏండ్ల వారికి టీకాలు వేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరి స్తున్న వ్యూహాన్ని భారత్ అనుసరించాలని సూచించింది.