Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి మిజోరం సీఎం లేఖ
- ఎన్డీయే భాగస్వామి లేఖతో సంతరించుకున్న ప్రాధాన్యత
ఐజ్వాల్ : తమ రాష్ట్రంలోని అన్ని ఏజ్ గ్రూపుల ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లను కల్పించాలని ప్రధాని మోడీని మిజోరం సీఎం జోరంతంగా కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మిజోరంలో ఎన్డీయే భాగస్వామిగా బీజేపీతో ప్రభుత్వంలో ఉన్న ఆయన ఉచిత వ్యాక్సిన్లను డిమాండ్ చేయడంతో ప్రాధాన్య తను సంతరించుకున్నది. ఈ విధమైన డిమాండ్‌ను తీసుకొచ్చిన తొలి ఎన్డీయే భాగస్వామి ఆయనే కావడం గమనార్హం. తమ రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను కోరు తూ జోరంతంగా ఇప్పటికే మోడీ సర్కారుకు డిమాండ్‌ను కూడా వినిపించారు. తాను చేసిన ఫ్రీ వ్యాక్సినేషన్ విజ్ఞప్తికి ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా మద్దతు పలకాలని జోరంతంగా కోరారు. మా లాంటి ప్రత్యేక కేటగిరికి చెందిన రాష్ట్రాలకు, ఇబ్బందుల్లో ఉన్న మా లాంటి రాష్ట్రాల ఆర్థిఖ వనరులను కాపడటానికి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను కల్పించాలి'' అని జోరంతంగా ట్వీట్ చేశారు. ఆయన ఈ ట్వీట్‌ను ఈశాన్య రాష్ట్రాలైన అసోం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ల సీఎంలతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాలకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం దేశంలో 45 ఏండ్లు పైబడినవారందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లనకు కేటాయిస్తుండగా 18-44 ఏండ్లు మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ల కోసం ఆయా రాష్ట్రాలు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.