Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : చిన్న పిల్లలకు కోవిడ్ చికిత్సానంతరం, కోలుకున్న రెండు వారాలలోపు కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కర్నాటక రాష్ట్రంలో వైద్యులు అంటున్నారు. గత మార్చి నుండి ఇప్పటివరకూ సుమారు 50 వేల మంది 0-9 సంవత్సరాల మధ్య ప్రాయం కల చిన్న పిల్లలకు కోవిడ్-19 సోకిందని, దానినుండి చికిత్సానంతరం కోలుకున్నవారిలో కొద్దిమందికి రెండు వారాల అనంతరం, జ్వరం, వళ్ళు నొప్పులు తలెత్తడంతో బాటు మల్లీ-ఆర్గాన్ డిస్ఫంక్షన్ (పలు అవయవాలు సరిగ్గా పని చేయకపోవడం) తలెత్తుతోందని చిన్న పిల్లల రోగనిరోధక విభాగ నిపుణులు డా. సాగర్ భట్టాడ్ అన్నారు. ఈ తరహా వ్యాధిని తాము '' కవాసాకి తరహా వ్యాధి'' గా పిలుస్తామని ఆయన అన్నారు. ఈ తరహా వ్యాధి లక్షణాలను తొందరగా గుర్తించగలిగితే నయం చేయడం తేలిక అని మరో చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. రవి కిరణ్ (సాక్రా వరల్డ్ హాస్పిటల్) అన్నారు. బెంగళూరులో ఉన్న ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్ లోనే ఇటువంటి కేసులు గత 15 రోజుల్లో 14 వరకూ నమోదయాయని డా. సాగర్ భట్టాడ్ తెలిపారు.