Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రెండు రోజుల ఆలస్యం తర్వాత నైరుతి రుతుపవనాలు గురువారం దేశంలోని ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ విభాగం(ఐఎండి) వెల్లడిం చింది. దీంతో జూన్-సెప్టెంబర్ నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభ మైందని తెలిపింది. ఈ పవనాలు మరో రెండు రోజుల్లో అరేబియా సముద్ర దక్షిణ, మధ్య ప్రాంతాలు, కేరళలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్, తమిళనాడులోని కొన్ని ప్రాం తాలు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తా, దక్షిణ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలకు చేరుకుంటాయని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ తెలిపారు.