Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ బ్యూరో
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగు తోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం గురువారం నాటికి 188వ రోజుకు చేరింది. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు. మరోవైపు జూన్ 5న మూడు నల్ల చట్టాల కాపీలను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపును జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఆ రోజున బిజెపి నేతలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు దగ్ధం చేయాలని ఎస్కెఎం కోరింది.