Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంఢఘీర్ : 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సమక్షంలో భోలథ్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖయిరా, భాదౌర్ ఎమ్మెల్యే పిర్మాల్ సింగ్, మౌర్ ఎమ్మెల్యే జగదేవ్ కమాలు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆప్ పార్టీపై తిరుగుబాటు ఎగురవేసి రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరు ముగ్గురూ 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి అప్‌లో చేరారు. మళ్లీ సొంతగూటికి వచ్చారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలను పరిష్కరిస్తామని పార్టీ అధిష్టానం హామీతో వారు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు.