Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెడెర్నా వంటి ప్రముఖ విదేశీ సంస్థలతో కోవిడ్ వ్యాక్సిన్ను దేశంలో ఉత్పత్తి చేయడంపై చర్చలు జరుపుతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రీంగ్లా తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ హెల్త్ పార్టన్నర్స్ ఫౌరంతో మాట్లాడుతూ భారత్ తీవ్రంగా ఉన్న కరోనా రెండో దశతో పోరాటం చేస్తోందని తెలిపారు. 'ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెడెర్నా వంటి ప్రముఖ విదేశీ సంస్థలతో కోవిడ్ వ్యాక్సిన్ను దేశంలో ఉత్పత్తి చేయడంపై చర్చలు జరుపుతున్నాం. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను దేశానికి వేగంగా రప్పించడానికి చర్యలు తీసుకున్నాం' అని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ పాత్రను వివరించారు.