Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కనీస వేతనాలు నిర్ణయించేందుకు, జాతీయ స్థాయిలో కనీస వేతనాలను క్రమబద్దీకరించేందుకు నిపుణలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. పై రెండు అంశాలపై కమిటీ సాంకేతిక అంశాలను, సిఫార్సులు చేస్తుందని, మూడు ఏళ్ల పాటు కమిటీ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రోఫెసర్ అజిత్ మిశ్రా ( డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రౌత్) నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రొఫెసర్ తరికా చక్రవర్తి ( ఐఐఎం, కోల్కతా), ప్రొఫెసర్ అనుశ్రీ సిన్హా (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్పీల్డ్ ఎకనమిక్ రిసెర్చ్), కార్మిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విభ భల్లా, వివిగిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్ (నోయిడా) డైరెక్టర్ జనరల్ హెచ్ శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. సభ్య కార్యదర్శిగా కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారుడు డిపిఎస్ నేగి ఉంటారు.