Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో మెహుల్ ఛోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు అక్కడి న్యాయస్థానం నిరాకరించింది. ఆరోగ్య కారణాల దష్ట్యా ఛోక్సీకి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే, కేసు తీవ్రత దష్ట్యా ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే బెయిల్ తిరస్కరణపై పైకోర్టుకు వెళ్తామని ఛోక్సీ తరపున న్యాయవాది చెప్పారు. ఛోక్సీని భారత్కు అప్పగించే విషయమై డొమినికా అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. అతడు ఆర్థిక నేరగాడని, అతడిని భారత్కు అప్పగించాల్సి ఉందని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆంటిగ్వా వెళ్తానని ఛోక్సీ పెట్టుకున్న అభ్యర్థనకు విచారణార్హత లేదని పేర్కొంది. ఆయన పారిపోయే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రస్తుతం ఛోక్సీ పోలీసు భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. రూ. 13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 2018లో దేశం విడిచి పారిపోయిన ఛోక్సి ఆంటిగ్వాలో నివస్తున్నాడు. అయితే గత నెల 23న ఆయన ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదశ్యమయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఛోక్సీని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం ఇప్పటికే డొమినికాకు చేరుకుంది.