Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతంజలి తప్పుడు ప్రచారమంటూ డీఎంఏ దావా
- పతంజలి తప్పుడుప్రచారమంటూ దావా
న్యూఢిల్లీ : యోగా గురు రామ్‌దేవ్‌బాబాకు ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్(డీఎంఏ) దాఖలు చేసిన దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 13వ తేదీ వరకు వాయిదా వేసిన కోర్టు, అప్పటి వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కొరోనిల్ టాబ్లెట్లతో కరోనా తగ్గుతుందని.. రామ్‌దేవ్‌కు చెందిన కంపెనీ పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంటూ డీఎంఏ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రామ్‌దేవ్ బహిరంగంగా చేసిన ప్రకటన సైన్స్‌తో పాటు వైద్యుల ప్రతిష్టను దెబ్బతీస్తుందని డిఎంఎ తన పిటిషన్లో పేర్కొంది. డాక్టర్ల హక్కుల కోసం ఈ పిటిషన్‌ను వేస్తున్నట్లు డిఎంఎ తరపున న్యాయవాది రాజీవ్ దుత్తా పేర్కొన్నారు. కొరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా అన్నది నిపుణులు తేల్చాల్సి ఉందని, కొరోనిల్‌కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల అల్లోపతిపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అల్లోపతికి 'స్టుపిడ్ సైన్స్'గా పేర్కొన్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.