Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి : 12వ తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోలు రూపొందించాలని కేంద్రీయ విద్యాలయం (కెవి) పాఠశాలలకు ఆదేశాలు అందాయి. దీంతో కేరళతో సహా, అనేక కెవి పాఠశాలల ఉపాధ్యాయులు ఇలాంటి వీడియోలు తయారు చేయాలని తమ విద్యార్థులను కోరుతున్నారు. ఈ సూచన మొదట కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నుండి వచ్చిందని, తరువాత కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ వాట్సాప్ ద్వారా ఈ సందేశాన్ని అన్ని కెవి ప్రిన్సిపాల్స్‌కు పంపినట్లు సమాచారం. దీంతో ప్రతి విద్యార్థి ఇటువంటి వీడియోలను అప్లోడ్ చేయాలని ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. ఇలాంటి వీడియోను తయారు చేయలేని విద్యార్థులు కెవి ట్విట్టర్లో అందుబాటులో ఉన్న వీడియోలను రీ ట్వీట్ చేయాలి. ఇలాంటి సందేశాలు 'థాంక్యూ మోడీ సార్' అనే హ్యాష్‌ట్యాగ్ చేయబడ్డాయి. అన్ని వీడియో సందేశాలు ఒకేలా ఉన్నాయి. 'పరీక్షలను రద్దు చేయడం ద్వారా ఈ క్లిష్ట సమయాల్లో మానసిక ఒత్తిడి నుండి మమ్మల్ని రక్షించినందుకు మోడీ సార్‌కు నా కతజ్ఞతలు' అనే విధంగా ఉన్నాయి. నిజానికి 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మోడీ గొప్పతనాన్ని సూచించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ ఇమేజ్ పెంచడానికి ఈ బలవంతపు వ్యూహంపై విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో నిరసన తీవ్రంగా ఉంది. పాఠశాల పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు కాబట్టి, వారు తమ నిరసన, ఆగ్రహం బహిరంగంగా వ్యక్తం చేయడానికి వెనకాడే అవకాశాలున్నాయి.