Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిపుణలతో కమిటీ ఏర్పాటుపై సీఐటీయూ విమర్శలు
న్యూఢిల్లీ : కనీస వేతనాలు నిర్ణయించేందుకు, జాతీయ స్థాయిలో కనీస వేతనాలను క్రమబద్దీకరించేందుకు నిపుణలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడాన్ని, కమిటీకి మూడు సంవత్సరాలు వ్యవధి ఇవ్వడాన్ని సీఐటీయూ తీవ్రంగా విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కనీస వేతనాలు నిర్ణయించేందుకు కమిటీని నియమించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జూన్ 3న విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలిసిందని తెలిపింది. ఒక ప్రభుత్వ కమిటీని మూడేండ్ల పాటు కొనసాగించడం మొత్తం ప్రక్రియను ఆలస్యం చేయడానికే అనే విమర్శించింది. సదరు మంత్రిత్వ శాఖ ఇలాంటి నిపుణుల కమిటీని 2018 జనవరిలోనూ ఏర్పాటు చేసిందని, 2019 జనవరిలో ఆ కమిటీ విలువైన నివేదిక కూడా ఇచ్చిందని సీఐటీయూ గుర్తు చేసింది. అయితే ఈ కమిటీ నివేదికపై చర్చలు తీసుకోకుండా, కొత్తగా మరొక కమిటీని మూడేండ్ల కాల పరిమితితో ఏర్పాటు చేయడంలో మర్మం ఏమిటనీ, కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి, సమీక్షించడానికి మూడు ఏండ్లు వేచి ఉండాలా..అని సీఐటీయూ ప్రశ్నించింది.
మీరు తెలిపిన సమాచారం ప్రకారమే.. కనీస వేతనాలు నిర్ణయించేందుకు కమిటీ సాంకేతిక ప్రమాణాలను, పద్ధతులను సిఫారసులు చేస్తుందని చెబుతున్నారు. కానీ ఇలాంటి సాంకేతిక ప్రమాణాలను, పద్ధతులను ఇప్పటికే ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్ (ఐఎస్సీ) ఇప్పటికే అందచేసిందని సీఐటీయూ గుర్తు చేసింది. ఈ సిఫారసులతోనే జులై 7 2020 విడుదల చేసిన డ్రాఫ్ట్ రూల్స్ ఆన్ కోడ్ ఆన్ వేజెస్ 2019ను మీ ప్రభుత్వం తయారు చేసిందని తెలిపింది. తాజాగా మీరు ఏర్పాటు చేసిన కమిటీ కనీస వేతనాలను ఖారారును ఆలస్యం చేయడానికే అనేది స్పష్టంగా వెల్లడవుతుందని సీఐటీయూ విమర్శించింది. ప్రస్తుత కమిటీని తక్షణమే ఉపసంహరించుకుని, కనీస వేతనాలను ఖరారు చేయాలయని కేంద్రానికి సీఐటీయూ విజ్ఞప్తి చేసింది.