Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటానికి ఉత్తమ మార్గం వ్యాక్సినేషనే అని కేంద్రం పేర్కొన్నా.. దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) సహకారంతో భారతదేశానికి చెందిన పానాసియా బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తయారీకి సంబంధించిన పిటీషన్ విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీకి 2012 నుండి వడ్డీతో పాటు రూ. 14 కోట్లకు పైగా ఆర్బిట్రల్ అవార్డును విడుదల చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
'ప్రస్తుతం, రెండో దశ వైరస్‌తో సంభవించిన విషయాలపై మేం బాధపడుతున్నాం. టీకా కొరత ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఢిల్లీలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు' అని విచారణలో పేర్కొంది. రష్యా నుంచి కొంత మంది వచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో మౌళిక సదుపాయాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఆ పని చేయలేకపోతుందని విమర్శించింది. సంస్థకు ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అందచేసే మొత్తం కూడా సంస్థ యొక్క బాధ్యతకు లోబడి ఉంటుందని, స్పుత్నిక్వి వ్యాక్సిన్ విక్రయించిన ఆదాయంలో 20% కోర్టులో జమ చేయబడుతుందని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నజ్మి వజీరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అవార్డు మొత్తం సురక్షితం అయ్యే వరకు రిజిస్ట్రీ అవుతుందని చెప్పింది.
జూలై 2020 ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన పనాసియా బయోటెక్ పిటీషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సంస్థ తన పిటీషన్లో ఆర్బిడిఎల్ అవార్డును విడుదల చేయాలని కోరింది. ఇప్పటికే ఆర్డిఐఎఫ్ సహకారంతో కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ట్రయల్ బ్యాచ్‌లను తయారు చేసినట్లు పిటీషన్లో పేర్కొంది.