Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ రేట్లు యథాతథం
- ద్రవ్యోల్బణం 5.1 శాతంపెరగొచ్చు
- సెలవు దినాల్లోనూ వేతనాలు : ఆర్బీఐ
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభం, మందగమన పరిస్థితుల నేపథ్యంలో జీడీపీ వృద్థి రేటు అంచనాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్థి రేటు 9.5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం 10.5 శాతంగా అంచనా వేసింది. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సమీక్షాలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనున్నది. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలో నగదు లభ్యత పెంచే చర్యల ద్వారానే వృద్థికి మద్దతును ఇవ్వగలమన్నారు.దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ ఎంఈలకు గతంలో ఇచ్చినట్టుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడి ంచారు. వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.1 శాతంగా ఉండనుందన్నారు. ఆదివారాలతో పాటు అన్ని బ్యాంకు సెలవు దినాల్లోనూ ఎన్ఏసీహెచ్ వ్యవస్థ పని చేస్తూనే ఉంటుంది.
ఎల్ఐసీ ఐపీఓ రూ.19 లక్షల కోట్లు..!
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) విలువ సుమారు రూ.19 లక్షల కోట్లు గా ఉండొచ్చని జెఫరీస్ ఇండియా విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విలువతో ఎల్ఐసీ మార్కెట్లో లిస్ట్ అయితే దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరి ంచనున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బీమా రంగంలో 70 శాతం మేర వాటా కలిగిన ఎల్ఐసీకి 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంచనా. బ్లూమ్బర్గ్ రిపోర్ట్ ప్రకారం.. త్వరలో ప్రారంభం కానున్న ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి బ్యాంకుల నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని భావిస్తోందని సమాచారం.