Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరేగా అమలుకు ఆసక్తి చూపని కేంద్రం
- తీవ్రమైన నగదు సంక్షోభంలో గ్రామాలు
- సెకండ్‌వేవ్ దెబ్బ.. పడిపోయిన లబ్దిదారుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ లేదా నరేగా ) పనులకు భారీగా డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది మే నెలలో 2.76కోట్ల కుటుంబాలు ఈ చట్టం కింద పనిని కోరాయి. అయితే గ్రామాల్లో ఉపాధి కోసం నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా పనులు కల్పించటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. అంతేగాక ఈ ఏడాది చట్టం అమలుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శలున్నాయి. గ్రామీణ కార్మికులు, వలసదారులు తీవ్రమైన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం వారికి కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
గత ఏడాది ఆదుకుంది ఉపాధి పథకమే
దేశంలో గతేడాది కరోనా మొదటివేవ్ పంజా విసిరినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. వారికి ఉపాధిని కల్పించింది. వలసకా ర్మికులు, రోజువారీ కూలీలను ఆపద కాలంలో ఆదుకున్నది. అయితే సెకండ్ వేవ్‌లో ఈ పథకం అమలు నత్తనడ కను తలపిస్తోంది. కారణం కేంద్ర ప్రభుత్వం నిధుల వ్యయం తగ్గించటమే. దాంతో పనికోసం డిమాండ్ ఈ ఏడాది మార్చి నెలలో పడిపోయింది. ఉపాధి హామీ పథకం లబ్దిదారుల సంఖ్య ఫిబ్రవరిలో 3.65 కోట్లుకాగా, మార్చి నెలలో అది 3.36 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3.52 కోట్లకు చేరుకుంది. మే నెలలో 3.61 కోట్ల మంది ఉపాధిని కోరారు.
తగ్గడానికి కారణం ఇదే...
ఈ ఏడా ది ఉపాధి హామీ కింద పని కావాలని కోరుకునేవారి సంఖ్య మార్చిలో తగ్గడానికి కారణం లాక్డౌన్ పరిస్థితులు. ఉపాధి కల్పించాలని ఈ ఏడాది మే నెలలో 2.5కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేయగా, ఇందులో కేవలం 1.6కోట్ల కుటుంబాలకు మాత్రమే ఉపాధి దక్కింది. గత ఏడాది ఇదే నెలలో 3.43కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేయగా, 3.04కోట్ల కుటుంబాలకు ఉపాధి దొరికింది. నగరాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు చోటుచేసుకున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్థిక నిపు ణులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉపాధి కోసం డిమాండ్ ఉన్నా దానికి అనుగుణంగా పనులు కల్పించలేక పోతున్నారని వారు చెప్పారు. గత కొన్నేండ్లుగా గ్రామాల్లో ఆదాయాలు పెద్దగా పెరగలేదని, 2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ వేతన వృద్ధి సగటు 'జీరో' నమోదైందని 'నోము రా'కు చెందిన ఆర్థిక నిపుణులు సోనాల్ వర్మ, అరోదీప్ నందీ తెలిపారు.
రెండో వేవ్ విభిన్నమైంది : సునీల్‌కుమార్ సిన్హా, ఆర్థికవేత్త
గత ఏడాది కరోనా సంక్షోభంతో పోల్చితే రెండో వేవ్ విభిన్నమైంది. మొదటివేవ్లో కోట్లాది మంది వలస కార్మికులు స్వంత ఊళ్లకు బయల్దేరగా, మార్గం మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు చిక్కుకు పోయారు. కానీ రెండో వేవ్ అలా కాదు. వైరస్ గ్రామాల్లోకి చొచ్చుకు పోయింది. ముఖ్యంగా వ్యవసాయేతర కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపో యాయి. ఇది గ్రామీణ డిమాండ్‌ను గణనీయంగా ప్రభావితం చేసింది. అలాగే వైద్య సేవల కోసం గ్రామీణ ప్రజలు అప్పులుచేయాల్సి వచ్చింది. నరేగా ద్వారా ఉపాధి దొరికినా వారు పొందిన ఆదాయం చాలా స్వల్పం.