Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరిక హెచ్చరిక అని, అధికారులను నియమించకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ హౌదాను కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. నూతన నిబంధనల అమలుకు సంబంధించి కేంద్రం సోషల్‌మీడియా సంస్థలకు మూడు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గడువు మే 26తో ముగిసింది. ఈ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి వుంది. అయితే ట్విట్టర్ ఈ అంశంపై స్పందించలేదు. నిబంధనల ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులుగా భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవ డంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాగా నిర్ధారించే వెరిఫైడ్ లేదా బ్లూ టిక్‌ను శనివారం ట్విట్టర్ తొలగించింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొన్ని గంటల్లోనే దాన్ని పునరుద్ధరించింది. ఈ పరిణా మాలు జరిగిన కొన్ని గంటల అనంతరం ట్విటర్‌కు కేంద్ర ఐటి శాఖ నోటీసు లు జారీ చేయడం గమనార్హం. కాగా, ట్విట్టర్ సంస్థకూ, కేంద్రానికి మధ్య ఫిబ్రవరి నుంచి ప్రకటనల యుద్ధం కొనసాగుతున్నది. దేశంలో కొన సాగుతున్న రైతుల నిరసనలపై ప్రభుత్వం మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలువురు ట్విట్టర్లో పోస్టులు చేశారు.